![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-14.54.04.jpeg)
ఏటిసి సెంటర్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి
లేబర్ ,ఎంప్లాయిమెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్
*ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ
రామగుండం, ఫిబ్రవరి -10: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని లేబర్, ఎంప్లాయిమెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ అన్నారు.
సోమవారం జిల్లాకు విచ్చేసిన లేబర్ , ఎంప్లాయి మెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పూల మొక్కతో స్వాగతించారు. అనంతరం రామగుండం ఐటిఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను వారు పరిశీలించారు
ఈ సందర్భంగా లేబర్ ,ఎంప్లాయిమెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, 6 ట్రేడ్ లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటిసి ( అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి పరికరాలను అమర్చెందుకు అందుబాటులోకి తీసుకొని రావాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు
6 ట్రేడ్ కోర్సులకు సంబంధించి పరికరాలు ఐటిఐ కు చేరుకున్నాయని, భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే సంబంధిత పరికరాలను ఇన్ స్టాల్ చేసి యువతకు శిక్షణ తరగతులు ప్రారంభించవచ్చని అన్నారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు
అనంతరం ఎటిసి సెంటర్ ప్రాంగణంలో కలెక్టర్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ మొక్కలు నాటారు ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ సెక్రటరీ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య,ఐటిఐ ప్రిన్సిపాల్ సురేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-14.54.04-1024x697.jpeg)