TRINETHRAM NEWS

75 సంవత్సరాలు గడుస్తున్న పూర్తిస్థాయిలో రాజ్యాంగం అమలు కాలేదు

దళిత వర్గాలకు రక్షణ భారత రాజ్యాంగం

29వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరిపులేందర్

దేశ ప్రజలందరి సమానత్వం కోసమే నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాశారని

మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మాజీ శాసనసభ్యులు టిఎస్ఆర్టిసి మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు, భారత రాజ్యాంగం ఆమోదం పొంది75 సంవత్సరాలు పూర్తవుతున్న దేశ ప్రజలందరికీ పూర్తిస్థాయిలో రాజ్యాంగ ఫలాలు అందలేదని రాజ్యాంగం అమలు కాలేదని ఆయన ఆవేదన చెందారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో,చేపట్టిన పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ, 29వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం,మాట్లాడారు, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయడానికి ఎంతో శ్రమించారని వారి యొక్క కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాలకు హక్కులు కల్పించబడ్డాయి అన్నారు, దళిత అనగారిన వర్గాలు ఆర్థికంగా సమానత్వంగా ఎదిగేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కాలేదని అన్నారు, రాజ్యాంగం అమలు కోసం కృషి చేయాలి అన్నారు, 29వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరి పులేందర్ మాట్లాడారు దేశంలోని దళితులకు రక్షణగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఉందన్నారు అన్ని రంగాల్లో ఎదిగేందుకు దళిత అనగారిన వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా
తీసుకోవాలని అన్నారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈవో మిట్టపల్లి రాజేంద్రకుమార్ ల నేతృత్వంలో, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన జ్ఞానమాల కార్యక్రమంలో, పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి, పరికిపండ్ల నరహరిని, కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులు, పులి మోహన్, గొర్రె రమేష్, సింగరేణి ఏజీఎం, మహేష్, మొలుగూరి వీరయ్య, ఆర్నకొండ వెంకటేశ్వర్లు, కొంకటి లక్ష్మణ్ మంతెన లింగయ్య, ఇరుగురాల కిష్టయ్య, కందుకూరి రాజారత్నం, ఎం ఏ కరీం, శనిగరపు చంద్రశేఖర్ పలువురు అభినందించారు,
ఈ కార్యక్రమంలో సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సలహాదారులు పులిమోహన్, హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్
ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి, మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కిష్టయ్య ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఆర్నకొండ వెంకటేశ్వర్లు,ప్రముఖ కార్మిక నాయకుడు మొలుగూరి వీరయ్య,
మాజీ కార్పొరేటర్ ములుకుంట్ల కృష్ణస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కోకన్వీనర్ గొర్రె నర్సింగరావు, జిల్లా కో కన్వీనర్లు గద్దల శశిభూషణ్,పోగుల రంగయ్య, రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి బొట్ల స్వామి దొమ్మటి శేఖర్,, ఏఐటీయూసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఎంఏ, కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, గోదావరి కళా సంఘాల సమైక్య సలహాదారులు కాశిపాక రాజమౌళి, ఇనుముల రాజమౌళి, రామగుండం మండల సీనియర్ నాయకులు, ఉప్పులేటి పవన్ కుమార్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు పెరిక రవి, డాక్టర్ కొండ్ర దాస్, కలువల మహేందర్
ఆసర్ల సదానందం
తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App