
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : కిందిస్థాయి కార్యకర్తల పోరాటపటిమతోనే కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగలిగిందని వారందరిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని కచ్చితంగా వారిని కాపాడుకుంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. పార్టీ అగ్ర నాయకుడు రాజీవ్ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి రేవంత్ రెడ్డి మాట తప్పని నాయకుడు అయ్యాడు అన్నారు.
యువత మహిళల అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందని వాటిని వినియోగించుకొని పురోగతి సాధించాలని సూచించారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో బుధవారం బాలానగర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాజీవ్ యువశక్తి పథకంలో అర్హులైన కార్యకర్తలందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
