TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం

*బీసీలు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న రేవంత్ సర్కార్

ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బత్తుల అంజి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి , గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ కలను సహకారం చేస్తూ దేశంలో ఎక్కడ జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ,దళిత బడుగు బలహీనవర్గాల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచి ఈరోజు బీసీలకు అవకాశాలు కల్పిస్తూన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుయజేశారు.

42 శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లును చట్టసభల్లో ఆమోదంతో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని నిరూపితమైందన్నారు.చారిత్రాత్మక బీసీ బిల్లును ప్రవేశపెడుతున్న కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కలిసిరాకపోతే బీసీ సామాజికవర్గం ఆ పార్టీలను ఎన్నటికీ క్షమించదని ఆయన అన్నారు .బీజేపీ వారికి నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ఉంటే దీన్ని కేంద్రంలో కూడా ఆమోదించేలా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదంతో కాంగ్రెస్‌ పార్టీయే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని మరోసారి రుజువయ్యిందన్నారు.

సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పడానికి బీసీ రిజర్వేషన్లు,ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభల్లో ప్రవేశపెట్టడమే దీనికి నిదర్శనం అన్నారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ,గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ములకలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు.., సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress government has kept