TRINETHRAM NEWS

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
క్యాంపస్‌ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ. హైదరాబాద్‌తో మైక్రోసాఫ్ట్‌ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. భవిష్యత్‌ అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)దే అని సీఎం పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌ కృషిలో 500 పాఠశాలల్లో ఏఐని వినియోగిస్తూ బోధన కొనసాగుతోందన్నారు. మైక్రోసాఫ్ట్‌ విస్తరణ ద్వారా తెలంగాణలో యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

new campus of Microsoft
new campus of Microsoft