
తేదీ : 13/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మండవల్లి మండలం, కానుకొల్లు సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెల్లడం జరిగింది. కైకలూరు నుంచి విజయవాడ వెళుతున్న కారుకు అడ్డుగా గేదేలు రావడంతో అదుపుతప్పి కారు రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెల్లడం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి స్థానికులు కారులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటికి తీసి , విజయవాడ కు చెందినవారీగా గుర్తించారు. ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పడం వలన ఊపిరి పీల్చుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
