TRINETHRAM NEWS

The call of the speakers in the dharna in front of the GM office

సింగరేణి బొగ్గు బ్లాక్ ల రక్షణకై అవసరమైతే సకలజనుల సమ్మె కైనా దిగుతాం

సింగరేణి సంస్థను కాపాడుకుందాం

జిఎం కార్యాలయం ముందు ధర్నాలో వక్తల పిలుపు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తేది 10:07:2024 నాడు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గోదావరిఖని ఆర్జీ1కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ ధర్నాలో AITUC,CITU, IFTU, IFTU సంఘాలు పాల్గొన్నాయి. ఈ ధర్నా కార్యక్రమంలో AITUC రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, CITU ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్, IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, IFTU రాష్ట్ర అధ్యక్షులు కె.విశ్వనాధ్ హాజరై మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గని కార్మికవర్గమంతా కూడా ఐక్యమై పోరాడుతున్నది.

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు ఎదురొడ్డి నిలబడుతున్నది. మోడీ సారథ్యంలోని
కేంద్ర ప్రభుత్వం కోల్ సెక్టార్ నుంచి ఒక లక్ష 75 వేల కోట్లు సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచి 500 బొగ్గు బ్లాక్లను దశల వారీగా వేలం వేస్తూ వస్తున్నది. కార్పొరేట్ల చేతుల్లోకి ఇప్పటికే 140కి పైగా బొగ్గు బ్లాకులు వెళ్లిపోయాయి. గత పార్లమెంట్లో 303 సీట్లు ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నీ అడ్డుకునే పరిస్థితి నిపక్షాలకు లేదు.

చర్చకు అవకాశమే లేకుండా ఏకపక్ష నిర్ణయాలను కేంద్రం తీసుకొంది. అది ప్రవేశపెట్టిన బిల్లుకు అప్పుడు తెలంగాణ ఎంపీలు అందరూ మద్దతు పలికారు. ఇందులో బొగ్గు బ్లాక్ల వేలం తో పాటు కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ, షేర్ల అమ్మకం కీలకంగా పేర్కొనవచ్చు, సింగరేణి సంస్థ కోల్ ఇండియాకు అనుబంధం కాని కారణంగా బతికి పోయింది.
ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం, పెద్ద ఎత్తున సాగుతున్నది. కోల్ ఇండియా అనుబం థ సంస్థ అయిన బీసీసీఎల్ (భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ )లో 25 శాతం పెట్టుబడి ఉపసహరణకు కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోల్ ఇండియా తన 33 శాతం షేర్లను అమ్మేసింది. కేంద్రం నిర్ణయం కారణం గా మరిన్ని షేర్లు ప్రైవేటుపరం కాను న్నాయి.

మోదీ మూడో సారి ప్రధాని అయ్యాక తాజాగా దేశంలోని 60 బొగ్గు బ్లాక్లకు వేలం వేసే ప్రక్రియ మన తెలంగాణలోనే మొదలు. పెట్టారు. గత పార్లమెంట్లో ఉన్న మెజారిటీ ఇప్పుడు బీజేపీకి లేకున్నా, మోదీ తన విధానం మాత్రం మార్చుకోలేదనేది కొత్తగా నిర్వ హించిన వేలం వల్ల స్పష్టమవుతోంది. గతంలో రామగుండానికి పీఎం సరేంద్ర మోదీ వచ్చినపుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు అదే మాట మన బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెబుతున్నారు. అప్పుడు బొగ్గు బ్లాక్ కేటాయించమని డిమాండ్ చేసినా ఏమీ సమాధానం చెప్పలేదు.

కేంద్ర, రాష్ట్రాల వాటాలు ఉన్న ఏకైక సంస్థ సింగరేణి, ఇందులో కేంద్రం వాటా 49 శాతం ఉంది. రాష్ట్ర వాటా 51 శాతం ఉంది. గత 20 ఏండ్లకు పైగా లాభాల్లో నడుస్తూ, 2001- 2002 ఆర్థిక సంవత్సరం నుంచి కార్మికులకు, లాభాల్లో వాటా ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డా తర్వాత రెండు సంవత్సరాలు మిగులు సర్వీస్ ఉన్న నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అనారోగ్యం.పాలై దరఖాస్తు చేసుకుంటే ఇన్వాలిడేషన్ చేసి, డిపెండెంట్లకు ఉద్యో గాలు ఇస్తున్న సంస్థ కూడా సింగరేణే .

ఈ నేపథ్యంలో కేంద్రం ప్రైవేటీకరణ పాలసీ ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకో వచ్చు. ఇప్పటికే ఇలాంటి విధానాల వల్ల కోల్ ఇండియాలో ఒకప్పుడు 8 లక్షల పైచిలుకు ఉన్న కార్మికుల సంఖ్య 3 లక్షలకూ, సింగరేణిలో 1901లో లక్షకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 43 వేలకూ పడిపో యాయి. కోల్ ఇండియా కూడా మంచి లాభాల్లో ఉంది. అయినా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ బారి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది కోల్ బ్లాక్ ను కేటాయించకుండా ఉంటే సింగరేణి నష్టాల్లో పడుతుంది. అప్పుడు దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయవచ్చనేది కేంద్రం యోచనగా కనబడుతున్నది.

అందుకే బొగ్గు బ్లాక్లను కేటాయించడం లేదు. ఒక వైపు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 2015 లోని బొగ్గు బ్లాక్ ల వేలం చట్టం లోనే, 17 (ఏ) సెక్షన్ ప్రకారం సింగరేణికి బొగ్గు బ్లాక్లను వేలంలో పాల్గొనకుండానే కేటాయించవచ్చు ఆ దిశగా మోడీ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిన బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు లేనట్లయితే తెలంగాణ కోసం సాగిన పోరాటంలో గని కార్మిక వర్గం పోషించిన పాత్రను తిరిగి పోషించాల్సి వస్తుందని అవసరమైతే సకలజనుల సమ్మె కైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు.

ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, ఆర్జీవన్ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఆరెళ్లి పోశం,CITU నాయకులు తోట నరహరి, ఆసరి మహేష్, జిల్లా గజేంద్ర, పి శ్రీనివాసరావు, అనబోయిన శంకరన్న, ఎస్కే గౌస్, దాసరి సురేష్, ఈ సాగర్, ఈదా వెంకటేశ్వర్లు, వందల శివరాం రెడ్డి, తాళ్ల శ్రీనివాస్, జంగాపల్లి మల్లేష్, జనార్ధన్, IFTU నాయకులు గూడూరి వైకుంఠం, ఆడెపు శంకర్, IFTU నాయకులు దాముక లచ్చన్న బుసిపాక రామచందర్ లతోపాటు 100 మంది ఆల్ యూనియన్స్ కార్యకర్తలు పాల్గొన్నారు

అభినందనలతో

తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The call of the speakers in the dharna in front of the GM office