అమరవీరుల ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలి
సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
నాడుభూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం 1969 నుండి ప్రతిఘటన పోరాట పంధా మార్గంలో పోరాడి అమరులైన అమరవీరులను స్మరిస్తూ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 1 నుండి 9 వరకు జరుగుతున్న అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఎన్టీపీసీ ఆఫీసులో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.* భారతదేశంలో వర్గాలు లేని ఒక నూతన సమాజాన్ని ఆవిష్కరించడం కోసం నూతన ప్రజాస్వామిక విప్లవమే లక్ష్యంగా పనిచేస్తూ, అర్థవలస అర్థ భూస్వామ్య వ్యవస్థను కూకటివేళ్ళతో కూల్చివేయాలనే లక్ష్యంతో అనేకమంది ఈ దేశంలో పని చేశారన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో యు రాములు, కె కుమార స్వామి, మొండన్న, పెండ్యాల నారాయణ, శ్రీధర్ రాజమల్లు, కొమరయ్య, కంది రాజారత్నం, మేకల రాజన్న, బుషిపాక దేవన్న, కోల నరసయ్య, కత్తెరమల్ల పోచన్న ఇలా అనేకమంది సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా పార్టీలో కొనసాగుతూ విప్లవోద్యమంలో పనిచేస్తూ అమరులైనారన్నారు. వారి ఆశయాలను సాధించడమే మన లక్ష్యం అన్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సనాతనధర్మాల పేరుతో, మతోన్మాద భావజాలంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి తమ రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజా వ్యతిరేకమైన దుర్మార్గమైన చట్టాలను తీసుకువచ్చి దేశ సంపదను కొల్లగొడుతున్నారన్నారు. కార్పొరేట్ వ్యవస్థను, ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహిస్తూ విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. దేశంలో ప్రజలు కూడు, గుడ్డ, నీడ లేక దున్నేవానికి భూమి లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. దోపిడీ లేని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేయడమే అమరవీరుల ఆశయాలను కొనసాగించడం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు జిందం రాంప్రసాద్ తోకల రమేష్ గుమ్మడి వెంకన్న గొల్లపల్లి చంద్రయ్య ఆడెపు శంకర్ గూడూరు వైకుంఠం వేముల లక్ష్మణ్ కలువల రాయమల్లు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App