
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఘనంగా తెలుగుదేశం పార్టీ, 43వ ఆవిర్భావ దినోత్సవం.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం శనివారం పాడేరు పట్టణంలో ఉన్నటువంటి, నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏపీ టూరిజం డైరెక్టర్, రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాత పాడేరు తన స్వగృహం నందు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, అన్నా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే 43 వసంతాల కేక్ కట్ చేసి ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి,మాజీ జిల్లా చైర్మన్ వంజంగి కాంతమ్మ,రాష్ట్ర కార్యదర్శి కొట్టగుల్లి సుబ్బారావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్, జనసేన నాయకులు జర్ర అంకిత్,సీనియర్ నాయకులు,తమర్భ గంతన్న,రామ్మూర్తి నాయుడు,ఎంపిటిసిలు అప్పారావు,ఈశ్వరరావు,మాజీ సర్పంచులు వెంకటేశ్వరవు,బాకురు బాలరాజు,కిల్లు వెంకటరత్నం,శోభ శ్రీనివాస్,యూనిట్ ఇంచార్జ్ లు మూర్తిబాబు,కొంతేలి వెంకట ప్రసాద్,బూత్ కమిటీ మజ్జి సతీష్ ,బోయిని రాధాకృష్ణ, యూత్ కమిటీ వంతాల మూర్తి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
