TRINETHRAM NEWS

32వ దివ్యాంగుల దినోత్సవo జరిగింది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ స్వయం ఉపాధితో దివ్యాంగులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యo పెట్టుకొని వ్యాపారం చేయాలని సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగులను గౌరవించాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ అన్నారు. బుధ వారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ హాల్లో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ అధ్వర్యంలో 32 వ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పాల్గొని మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని వ్యాపారాలు చేయాలని అన్నారు.సకలాంగులతో సమానంగా పోటీ పడాలని సూచించారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు.
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ గురుదేవి,మాట్లాడుతూ.
వికారాబాద్ జిల్లా 212 మంది చిన్న, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలైనటువంటి దివ్యాంగులను గుర్తించి,వారికి వారి ప్రతిభకు తగ్గట్టుగా వారు చేస్తున్న వ్యాపారాలను బలోపేతం చేస్తూ మెరుగైన జీవనోపాధిని పొందడానికై అర్హులైన దివ్యాంగులకు 25 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ రామేశ్వర్, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు నర్సింలు, కమ్యూనిటీ వాలంటీర్లు R.రాములు ,హనుమంత్ రెడ్డి ,జ్యోతి, శ్రీశైలం, శరత్ చంద్ర రెడ్డి , లబ్ధిదారులు కొండయ్య, సఫియా బేగం, దేవి, సురేష్ , అలవేలు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App