
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు- ఆదివాసి జేఏసి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : 1/70 భూబదాలయింపు నిషేధ చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదని,ఆదివాసీ చట్టాలను పరిరక్షిస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి నాయకులు ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు, నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి ఇచ్చిన ఫిబ్రవరి 12 రాష్ట్రవ్యాప్త ఏజెన్సీ బంద్ పిలుపుకు స్పందించి, 1/70 భూ బదాలాయింపు నిషేధ చట్టం తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఆదివాసుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి ధన్యవాదాలు తెలిపింది.
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలతో అభద్రతకులోనైనా అదివాసులలో మనోదైర్యం నింపడానికి ఫిబ్రవరి 12 తారీఖున రాష్ట్రవ్యాప్త ఏజెన్సీ బంద్ కు అంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి ఫిబ్రవరి 3వ తారీఖునా ప్రకటించింది. ఆదివాసి జెఎసి పిలుపునందుకున్న మరుక్షణమే యావత్తు ఆదివాసీ సమాజం కదిలిరావడాన్ని ఆదివాసి జెఎసి హర్షిస్తుంది. అంతేకాకుండా, ఆదివాసులతోపాటు మరికొన్ని రాజకీయ పార్టీలు,వారి అనుబంధ సంఘాలు ఉద్యమంలోకి కలిసిరావడం, వాణిజ్య, వ్యాపార వర్గాలు, రవాణా సంబంధిత వర్గాలు స్వచ్చందంగా మద్దతు ప్రకటించడాన్ని ఆదివాసీ జెఎసి హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది. మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.అందరి సహకారంతో ఆదివాసి హక్కులు,ఉద్యమాలు భవిష్యత్తులో ఇంకా బలపడాలని ఆశిస్తున్నాం.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, సర్వోన్నతమైన పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు ఏజెన్సీ ప్రాంతాలలో నాన్ ట్రైబల్స్ (అదివాసేతరులు) బినామీ పేర్లుతో పెట్టుబడులు పెడితే, 1/70 భూబదలాయింపు నిషేద చట్టం అడ్డం పెట్టుకుని బినామీ ఆస్తులు లాగేసుకొంటారని, ఆదివాసుల రక్షణగా ఉన్న రాజ్యాంగ వ్యవస్థను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆదివాసి జెఎసి నిరసనలు కొనసాగిస్తుంతుందని తెలియజేస్తున్నాం. ఈ నెల 24 వ తారీఖు నుండి జరిగే అంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుచే ఆదివాసులకు క్షమాపణలు చెప్పించాలని, ఆయనను స్పీకర్ పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ కు ముందుగా జిఓ నెం 3 విషయంలో సరియైన నిర్ణయం తీసుకోవాలని,అంధ్రప్రదేశ్ లో తక్షణమే గిరిజన సలహా మండలి(టిఏసి)ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని, ఆదివాసి హక్కుల విషయంలో రాజకీయపక్షాలు ఆదివాసులకు సహాజ ద్రోహులు కాగా, రాజకీయ పార్టీలలో ఉన్న మన ఆదివాసి ప్రజాప్రతినిధులు అంతర్గత ద్రోహులు. వీరు చేస్తున్న ద్రోహపూరిత చర్యలపై కూడా ఆదివాసి జెఎసి ఉద్యమం కొనసాగిస్తుంది.
ఆదివాసి హక్కులు కాలరాయడానికి ఏజెన్సీ ప్రాంతాలకు అక్రమంగా చొరబడిన వలసదారులతో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటామని ప్రకటిస్తున్నారు. ఇటువంటి కుహన రాజకీయ నాయకులు, బినామిదారులకు ఆదివాసి జెఎసి ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని హెచ్చరిస్తున్నామని,ఫిబ్రవరి 12 పిలుపునకు ఆదివాసులు స్పందించిన తీరు ఆదివాసి జెఎసి నాయకత్వానికి ఎంతో భరోసా ఇచ్చిందని,ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు, మండల కన్వీనర్ కొర్ర బలరాం,ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ మార్క్,జెఎసి సోషల్ మీడియా రాష్ట్ర సభ్యుడు రీమెల పాలు, జెఏసి మండల సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు లకే రామచంద్రుడు,జెఏసి మండల కార్యవర్గ సభ్యుడు కొర్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
