TRINETHRAM NEWS

తీవ్రలోటులో పదినోటు ……

Trinethram News : మార్కెట్ లో పది రూపాయల నోటుకు తీవ్రలోటు ఏర్పడటంతో అటు వినియోగదారులు, వ్యాపార సంస్థల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అరకొర నోట్లు వినియోగంలో ఉన్నా ఎక్కువగా చినిగిన, బాగా నలిగిన నోట్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండే నోట్లు వస్తున్నాయి. పదినోట్ల కోసం బ్యాంకుల వారిని సంప్రదించినా నోట్లు చిరిగినవి,బాగా నలిగినవి ఉన్నాయి ఇవ్వమంటే ఇస్తాము అని సమాధానం చెపుతున్నారు.మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా తీరుతుందో అని ప్రజలు ఆలోచనలో పడ్డారు.