TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, జిల్లా ఇంచార్జ్ : దారలమ్మ అమ్మవారు ఆలయంలో, ముహూర్తం రాటా వేస్తున్న శాసన సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ , మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

అల్లూరిజిల్లా, గూడెం కొత్త వీధి మండలం, దారకొండ పంచాయతీ లో వేలిసిన గిరిజన ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం శ్రీ.శ్రీ.శ్రీ ధారలమ్మ అమ్మవారు పండగ మహోత్సవాలు ఈనెల తే 29, 30, 31 ది న జరగబోయే మహోత్సవాలు పురస్కరించుకుని, ఈరోజు అమ్మవారు ఆలయం వద్ద ముహూర్తం రాటా వేసిన శాసన సభ్యులు మరియు వైసీపీ అల్లూరి జిల్లా అధ్యక్షులు , మత్స్యరాస విశ్వేశ్వర రాజు. ఈవో,ఎంపీపీ, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులతో కలిసి పండితుల వేద మంత్రాలతో, డప్పు వాయిద్యాలతో వైభవంగా ముహూర్తపు రాట వేసి మహోత్సవాలు తేదీలు ఖరారు చేసి ప్రారంభించారు.
•శాసన సభ్యులకు దేవాలయం ఈవో మరియు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి అమ్మవారు చిత్రపటం అందజేశారు. •శాసన సభ్యులు మాట్లాడుతూ ధారలమ్మా అమ్మవారు పేరుగాంచిన దేవత. భక్తులు కోర్కెలు తీర్చే దేవతగా భావిస్తారు. పొరుగు రాష్ట్రాలు నుండీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. నిత్యం భక్తులతో, కిటకిటలాడుతుంటాయి. అందుకు ఈ ఏడాది ఈ నెల జరగబోవు మూడు రోజులు ఉత్సవాలకు భక్తులు పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొంది ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.

_ఈ కార్యక్రమంలో ఈవో సాంబశివరావు, ఎంపీపీ బోయిన కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి కంకి పాటి గిరి ప్రసాద్,సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుందేరి రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్ కుమార్, రింతాడ సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి , ఎంపీటీసీ కిల్లో ఈశ్వరి, వంతాల అరుణ్ కుమార్, నాయకులు గంగాధర్, పోతురాజు జగన్నాథం, కూడా సుబ్రమణ్యం, పిల్ల బుజ్జిబాబు, రెడ్డి మోహన్ రావు, కంకి పాటి నారాయణ,ఎం గజపతి, కోడా బాంజుబాబు, వంతాల చిట్టి బాబు, జర్రేల చిట్టి బాబు, బోయిన వెంకట్, రెడ్డి రాముర్తి, యువ నాయకులు కొర్ర బాబీ, చందు, మూర్తి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Temple Committee Chairman Matsyarasa