
తేదీ : 29/03/2025 ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ , సూరంపాలెం గ్రామాల్లో 43వ ఆవిర్భ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. చాట్రాయిలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి బసవా రెడ్డి, యన్ టి ఆర్ విగ్రహానికి పూలమాలవేసి , కొబ్బరికాయ కొట్టి జెండా ఎగరవేశారు.
మండల నాయకులు, కార్యకర్తలు ప్రజలు కు లడ్డులు మిఠాయిలు, పంచిపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి గురించి, సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా చనుబండ సూరంపాలెం గ్రామాల్లో ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మొరం పూడి. శ్రీనివాసరావు అక్కడ ఉన్నటువంటి యన్ టి ఆర్ విగ్రహానికి పూలమాలవేసి కొబ్బరికాయ కొట్టినారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కార్యకర్తలు, నాయకులు లడ్డులు , మితాయి లు వచ్చిన వారందరికీ పంచిపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి గురించి, సూపర్ సిక్స్ పథకాల గురించి తెలిపారు. కూటమిప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటిలో చీకటి తొలగి వె లుగు వచ్చిందని కొనియాడారు. ప్రజలు, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి 43వ ఆవిర్భ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
