
Telangana ‘Tet‘ Details Modification Another Chance
Trinethram News : హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో మార్కులు, హాల్‌టికెట్, ఇతర పలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో దొర్లిన తప్పుల సవరణకు పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వనుంది.
డీఎస్సీ తుది కీ విడుదలైన నేపథ్యంలో పదుల సంఖ్యలో అభ్యర్థులు టెట్ వివరాల తప్పులను సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి తరలివస్తున్న నేపథ్యంలో అవి సవరించకుండా డీఎస్సీ జనరల్ ర్యాంకు లిస్ట్(జీఆర్‌ఎల్) ఇస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు సవరణలకు అవకాశం ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా అభ్యర్థుల ఫోన్లకు కూడా సంక్షిప్త సందేశాలను పంపనున్నారు. నేడో రేపో సవరణలకు అవకాశం ఇస్తూ అధికారికంగా ప్రకటించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

Comments are closed.