![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-20.14.36.jpeg)
శ్రీ చిలుకూరు బాలాజీ టెంపుల్ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండించిన : తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 10 : జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ బొంగునూరి మహేందర్ రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధా రాం రాజలింగం , వీర మహిళా విభాగం అధ్యక్షురాలు కావ్య , రంగరాజన్ నివాసమునకు వెళ్లి దాడికి జరిగిన పరిస్థితులను తెలుసుకొని పరామర్శించారు.
ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రంగరాజన్ పై జరిగిన దాడి బాధాకరమైన విషయమని దోషులను రాష్ట్ర ప్రభుత్వము వెంటనే పట్టుకొని కఠిన శిక్ష విధించాలని , రంగా రాజన్ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతు పవన్ కళ్యాణ్ మరియు జన శ్రేణులు వారికి అండగా ఉంటారని అన్నారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు ,గ్రేటర్ హైదరాబాద్ నాయకులు , జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-20.14.36-759x1024.jpeg)