TRINETHRAM NEWS

Telangana State Chief Minister Revanth Reddy is an ideal for the country in farmer’s welfare

*సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా జరిగిన రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్

సుల్తానాబాద్, జూలై-18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయం నుంచి శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర మంత్రి వర్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్రంలోని పలు రైతుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్ బ్యాక్ స్వీకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల లోపు 2 లక్షల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, రెండవ విడతలో లక్షన్నర వరకు, మూడవ విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉండి రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ పథకం వర్తింపజేస్తామని, రేషన్ కార్డు రుణమాఫీ పథకానికి ప్రామాణికం కాదని, 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు, రెన్యువల్స్ ను అసలు వడ్డీ కలిపి ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింప చేస్తామని సీఎం పేర్కొన్నారు.

రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.ఆదిరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సి.జగన్మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana State Chief Minister Revanth Reddy is an ideal for the country in farmer's welfare