
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది వికారాబాద్ కన్వీనర్ కొలుమూల నాగభూషణం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల ఆశలు అడియాశలైనవి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సమాజం దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేసింది అమరుల త్యాగాలచే 1200 మంది విద్యార్థులు యువకుల బలిదానాలతో భౌగోళిక తెలంగాణ రూపంలో అది నెరవేరింది కానీ మొదటి నుండి తెలంగాణ ప్రజా ఫ్రంట్ దోపిడి పీడనలేని ప్రజాస్వామిక తెలంగాణకై మహనీయుల ఆశయాల సాధనకై ప్రజల పక్షాన పోరాడుతున్నది.
మలిదశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న సందర్భంలో ఆంధ్ర వలస పాలకులు భయపడిపోయి ఉద్యమాన్ని ఆపాలని కుట్రలు పన్నినారు తెలంగాణ ఉద్యమకారులను అంతక ముఠాలచే హత్యగావించారు నిర్బంధించినప్పుడు నిర్బంధాలు ఎదుర్కోని నిలబడ్డ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రజల కోసం ప్రజలకై ప్రజా ఆకాంక్షల మేరకు తెలంగాణ రావాలని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలు జరగాలని విద్య వైద్యం ప్రతి కుటుంబానికి ప్రభుత్వం విధిగా అందించాలని ముందంజలో ఉండి పోరాడుతుంది కనుక మార్చి 9 న వికారాబాద్ కేంద్రంలో జరగబోవు మొదటి మహాసభలను తా డిత పిడిత దలిత అనగారిన సంబండ వర్గాల ప్రజలు పౌరసమాజం యువత విద్యార్థులు మేదావులు రైతులు విజయవంతం చేయాలని
వికారాబాద్ జిల్లా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్ నాగభూషణం తెలిపారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కమిటీ సభ్యులు కడమంచి రాంబాబు. వడ్ల విశ్వనాథంకే గోపాల్ చైతన్య సిరిపురం సంతోష మధు ప్రభావతి యాదయ్య మల్లయ్య శివకుమార్ తదితరులు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేసి ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
