Telangana Foundation Day celebrations under the auspices of Congress
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మొదటగా తెలంగాణ పోరాట అమరవీరులకు మౌనం పాటించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి సెక్రటరీ కాల్వ లింగస్వామి ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి హాజరై కాల్వ లింగస్వామి చేతులమీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది
ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజల సామూహిక స్వప్నం సుదీర్ఘ ఆకాంక్ష సబ్బండ జాతుల సమిష్టి ధ్యేయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేక రూపాల్లో కొనసాగిన తెలంగాణ ఆకాంక్ష సోనియా గాంధీ వల్లనే సాధ్యమైందని చెప్పారు రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రాజకీయ ప్రక్రియను అంకురార్పణ చేసి అంచలంచెలుగా ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ జాతీయస్థాయిలో అనేక సైద్ధంతిక భావ సారూప్యం లేని పార్టీల మధ్య విశృత అంగీకారం కుదిర్చి తెలంగాణ సాధించి పెట్టారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా రాజకీయ నష్టం జరిగినా సరే చిరునవ్వుతో ఎదుర్కొని చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన ఒకే ఒక్క దీశాలి సోనియమ్మ
తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత పదేళ్లలో సోనియమ్మ దయతోనే తెలంగాణ వచ్చిందని సోనియమ్మ లేకుంటే తెలంగాణ లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకుంటూనే ఆమె చరిత్రని చెరిపి వేసే ప్రయత్నం బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేరిపివేసే ప్రయత్నం చేశాయని చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో ముస్తఫా, గట్ల రమేష్, కొలిపాక సుజాత మల్లయ్య, యుగంధర్ దీటి బాలరాజ్, అడ్డాల రామస్వామి, బాలరాజ్ కుమార్, దాతూ శ్రీనివాస్, నజీముద్దీన్, గుంపుల తిరుపతి, దూళికట్ట సతీష్, యాకుబ్, అనుమ సత్యనారాయణ, కీర్తి నాగరాజు, మారెంగుల రమేష్,పీక అరుణ్, మీసాల సతీష్, రఘుపతి, ఆడేపు రవి, దశరథం, బాబు మియా, దాసరి విజయ్, మెంటం ఉదయ్, కుంటసది, బాబు, గడ్డం శీను, వరలక్ష్మి ,మోహిద్ సన్నీ,శాస్త్రి, మధుకర్, అంజయ్య, రాజకుమార్,వెంకటరమణ మల్లేష్ యాదవ్ బంధం భూషణ్ గౌడ్,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App