TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 26
ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూ స్తున్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టిజిటి ఉ ద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.

ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో ఉంచింది. గురుకులాల్లో 4,020 పోస్టులు ట్రైయి న్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, టిజిటి పోస్టులకు గతేడాది ఆగస్టు లో రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1: :2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రొవిజి నల్ సెలెక్షన్ జాబితాలను విడుదల చేసింది.

ప్రొవిజి నల్ జాబితాలో ఉన్న హాల్‌టికెట్ నంబర్ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ కింది తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించింది.

సబ్జెక్టుల వారీగా ఎంపికైన జాబితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది…