TRINETHRAM NEWS

తెలంగాణ సీఎం సమాచారం లీక్…

అప్రమత్తమైన ఇంటెలిజెన్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా ఆయన భద్రతకు సంబంధించిన విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం పలు మార్పులు చేసింది.

ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేతృత్వంలో రేవంత్ భద్రతపై సమీక్షించిన తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పనిచేసిన ఇంటెలిజెన్స్ వింగ్ కు సంబంధించిన అధికారులు ఇప్పటికీ రేవంత్ రెడ్డి వద్ద కొనసాగుతున్నారు.

వీరందరిని తొలగించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలుసైతం జారీ అయ్యాయి.