TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లోని ఉద్యోగుల పట్ల చూపిస్తున్న వివక్ష కారణంగా రాష్ట్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు పెద్దపెల్లి జిల్లాలోని ఐసిటిసి, ఎఆర్టి, ఎస్ టి ఐ, పి పి టి సి ఇతర ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెటర్ క్యాంపెన్ ద్వారా తమ బాధలు పంపించడం జరిగింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మార్గదర్శకాలు పాటించకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా రెండు రోజులు పని దినాలను తగ్గించి రెండు రోజుల గ్యాప్ తర్వాత అంటే 2-4-2025 నుండి 30-3-2026 వరకు ఉద్యోగులకు అగ్రిమెంటల్ లెటర్స్ ఇచ్చారు. మధ్యలో రెండు రోజుల పనిదినాలు తప్పించి ఇవ్వడం ద్వారా ఉద్యోగుల సర్వీస్ పాయింట్లు పోయేలాగా చేస్తున్న తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డిపార్ట్మెంట్. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఈ సంవత్సరం కొత్తగా రూల్ పెట్టి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న డిపార్ట్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి లెటర్ క్యాంపైన్ ద్వారా తమ బాధలు పెద్దపెల్లి టీ సాక్స్ ఉద్యోగులు గోదావరిఖని లోని ఆర్ట్ సెంటర్ లో జరిగిన కార్యక్రమం లో పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీజీ శాక్స్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister TG SAX