
Trinethram News : తెలంగాణ బడ్జెట్ 2025-26
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అన్ని సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలో రైతులకే కాకుండా ఇతర రంగాల వారికి కూడా అధిక బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో వెల్లడించారు. మరి ఈ బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారో చూద్దాం..
₹3,04,965 కోట్లు – మొత్తం వ్యయం
₹2,26,982 కోట్లు – రెవెన్యూ వ్యయం
₹36,504 కోట్లు – మూలధన వ్యయం
కేటాయింపులు
₹40,232 కోట్లు – షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
₹31,605 కోట్లు – పంచాయతీరాజ్ & గ్రామీణం
₹24,439 కోట్లు – వ్యవసాయం
₹23,373 కోట్లు – నీటిపారుదల
₹23,108 కోట్లు – విద్య
₹21,221 కోట్లు – ఇంధనం
₹17,677 కోట్లు – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
₹17,169 కోట్లు – షెడ్యూల్డ్ తెగల సంక్షేమం
₹12,393 కోట్లు – ఆరోగ్యం
₹11,405 కోట్లు – వెనుకబడిన తరగతుల సంక్షేమం
₹5,907 కోట్లు – రోడ్లు & భవనాలు
₹5,734 కోట్లు – పౌర సరఫరాలు
₹3,591 కోట్లు – మైనార్టీ సంక్షేమం
₹3,527 కోట్లు – పరిశ్రమలు
₹2,862 కోట్లు – మహిళలు మరియు శిశు సంక్షేమం
₹1,674 కోట్లు – పశుసంవర్ధకం
₹1,023 కోట్లు – అడవులు & పర్యావరణం
₹900 కోట్లు – యువజన సేవలు
₹775 కోట్లు – పర్యాటకం
₹774 కోట్లు – సమాచార సాంకేతికత
₹465 కోట్లు – క్రీడలు
₹371 కోట్లు – చేనేత
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
