
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం గోదావరిఖనిలో నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ కార్మికులకు కర్షకులకు ప్రజలకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆ పరమశివుడు ప్రజలందరికి దీవెనలు ఇచ్చి చల్లగా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటాన్నాము. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్ అధికారులను తెలుగుదేశం పార్టీ పక్షాన గోదావరి నదిలో నీరు ఇంకిపోయిందని, తక్షణమే ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.
అంతే కాకుండా శివరాత్రి సందర్బంగా వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా గెలిచి 47 సంవత్సరాలు పూర్తి చేసుకొని 48వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్బంగా నారా చంద్రబాబునాయుడు కి రామగుండం తెలుగుదేశం పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కే నిమ్మకాయలు ఏడుకొండలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి టిఎన్టియూసి పార్లమెంట్ అధ్యక్షుడు, పెగడపల్లి రాజనర్సు సింగరేణి కాలరిస్ లేబర్ యూనియన్ కోశాధికారి ఆఫీస్ ఇంచార్జి, గుండా బోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు వీర అభిమాని, చిటికెల రాజలింగం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, బేక్కం వీరేందర్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఏల్పుకొండ నరసయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
