తాడేపల్లి
ఆందోళన చెందవద్దు – లోకేష్ అండగా నిలుస్తారు.
రైల్వే స్ధలాల్లో ఇళ్ల భాధితుల టిడిపి భరోసా.
రైల్వే స్ధలాల్లో నివాసులు ఆందోళన చెందవద్దు – లోకేష్ అండగా నిలిస్తారని టిడిపి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు భరోసా ఇచ్చారు. గురువారం పట్టణంలోని రైల్వే స్ధలాల్లో ఇళ్లును పరిశీలించిన వెంకట్రావు మాట్లాడుతూ గతంలో నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారమే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ స్ధలాలను రెగ్యులేషన్ చేసి ఉన్నచోటే ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ధారా దాసు, నాయకులు ఇట్టా భాస్కర్, అద్దంకి మురళి, కేళి వెంకటేశ్వరావు, కె. నిర్మల తదితరులు పాల్గొన్నారు.