TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మాట్లాడే ఎమ్మెల్యే లు ,ఎంపీలు వారి కులదృవ పత్రాలు మీరు తీసుకోండి . ఆదివాసి జే ఏ సి.

అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో బోయ వాల్మీకి లు ఏబై లక్షల మంది ఉన్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలి అని మాట్లాడడం మరియు తెలంగాణ లో ఐదు లక్షల మంది బోయ వాల్మీకి లు ఉన్నారు.అని డీకే అరుణ వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని మాట్లాడుతున్నారు.మీరు ఇద్దరు బోయ వాల్మీకిల తెగకు చెందిన వారా లేక పోతే వారి కులద్రువ పత్రాలు,మీరు మీ కులదృవ పత్రాలు వారికి మార్చుకోండి.మాకు అభ్యంతరం లేదు అంతేకాని, మా రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్న బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చాలని మాట్లాడుతున్నారు.

స్వతంత్రం వచ్చి, డబ్బయ్ ఐదు సంవత్సరాలు గడిచినా ఆదివాసి ప్రాంతం అభివృద్ధి ఎక్కడ వేసిన, గొంగళి అక్కడే. 25 లక్షల మంది ఉన్న ఆదివాసీల పై , 50 లక్షల మంది బోయ వాల్మీకి లు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలి అని చూడడం, ఇప్పుడు ఉన్న ఆదివాసీలకు మింగా మెతుకులేదు కానీ మా మెడకు ఒక డోలు అన్నట్లు మాట్లాడడం సరికాదు.మీకు చేతనైతే ఆదివాసి అభివృద్ధి కోసం మాట్లాడండి. నిరుద్యోగం, విద్య ,వైద్య మంచి నీరు,రోడ్లు,పక్క గృహాలు కరెంటు ఇలా అనేక సమస్యలు ఉన్న మీకు కనిపించవు. మీకు కనిపించేది బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చాలని,

ఈ విషయం పై ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ మాట్లాడరు ఇలాంటి ఎమ్మెల్యే లే ఆదివాసి ప్రాంతానికి అభివృద్ధి చెందకుండా అడ్డుపడేది.ఒకరు గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలి అంటారు,మరొకరు పక్క గృహాలు ప్రభుత్వం మంజూరు చేయాలని అంటారు. ఆదివాసి హక్కుల పై కనీస అవగాహన లేని ఇలాంటి ఎమ్మెల్యే లను గెలిపించు కోవడం ఆదివాసీల దౌర్భాగ్యం అంటూ ఆదివాసి జే ఏ సి జిల్లా కమిటీ సభ్యులు, ఎస్.అశోక్ లాల్ మీడియా ముందు మండిపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

caste certificates of the