హమాలీ కూలీ రేట్లు పెంపుదల కోసం చొరవ చూపండి
డిప్యూటీ లేబర్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన ఏఐటియుసి నాయకులు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని కూరగాయల మార్కెట్ లో పని చేస్తున్న హమాలీ కార్మికుల కు కూలీ రేట్లు పెంపుదల కోసం హోల్ సేల్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని కోరుతూ కరీంనగర్ లో ఉన్న డిప్యూటీ లేబర్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని గోదావరిఖని కూరగాయల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మరియు ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.గౌస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరిఖని కూరగాయల మార్కెట్ లో గత ముప్పై ఐదు సంవత్సరాలు గా దాదాపు 60 మంది కార్మికులు హమాలీ వర్కర్స్ గా పని చేస్తున్నారని, వారికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి హోల్ సేల్ వ్యాపారులు కూలీ రేట్లు పెంచే ఆనవాయితీ ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం వీరి కూలీ రేట్ల పెంపు కాలపరిమితి 2019 తో ముగిసిందని, వీరికి కూలీ రేట్లు పెంచాలని హోల్ సేల్ వ్యాపారులకు మరియు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.
గత సంవత్సరం నుంచి హమాలీ వర్కర్స్ కు కూలీ రేట్లు పెంచాలని అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, 2024 జనవరి లో కరీంనగర్ లో డిప్యూటీ లేబర్ కమిషనర్ వద్ద హోల్ సేల్ వ్యాపారులకు మరియు హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులతో సమావేశం జరిగిందని, ఇట్టి సమావేశంలో హోల్ సేల్ వ్యాపారులు హమాలీ వర్కర్స్ కు కూలీ రేట్లు పెంపుదల విషయం లో హోల్ సేల్ వ్యాపారులు సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించుకుంటామని లేబర్ కమిషనర్ వద్ద హామీ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.
ఇప్పటికీ సంవత్సరం గడిచినా హోల్ సేల్ వ్యాపారులు హమాలీ వర్కర్స్ కు కూలీ రేట్లు పెంపుదల విషయం లో నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదని ఆయన ఆరోపించారు. హమాలీ వర్కర్స్ కు కూలీ రేట్లు పెంపుదల విషయం లో తమరు స్పందించి హోల్ సేల్ వ్యాపారులతో పరిష్కారం చేయాలని ఆయన లేబర్ కమిషనర్ ను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కండె లక్ష్మయ్య, గడ్డం రాంచందర్, గాలిపెల్లి సతీష్, బండారి రవి, ఆవుల ఐలయ్య, జానీమియా తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App