
త్రినేత్రం న్యూస్…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ములకలపల్లి మండలం సితాయిగూడెం మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్
నేటి నుంచి పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వ కుండా, ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ములకలపల్లి మండలం సీతాయిగూడెం మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో ఆయన ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు – ఇన్నాళ్లు పడిన కష్టానికి తగిన విజయం మీకు అందాలని కోరుకుంటున్నాను. మీ భవిష్యత్తుకు కీలకమైన మలుపు ఇది. పరీక్ష హాల్ కు సకాలంలో చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, కోరుకున్న లక్ష్యం తప్పక నెరవేరుతుందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
