TRINETHRAM NEWS

శానిటేషన్ అధికారుల నిర్లక్ష్యం పై చర్య తీసుకోండి

సంపూ నిర్మాణం జాప్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పై చర్య తీసుకోండి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

20 డివిజన్లో చెత్త సేకరణకు రావలసిన ట్రాక్టర్ సరిగ్గా రావడం లేదు. వచ్చిన ట్రాక్టర్ సెల్ఫ్ లేకపోవడం ట్రాక్టర్ పై లేబర్ లేకపోవడం జరుగుతున్నది. గత ఎన్నో సంవత్సరాలుగా 4 డివిజన్లకు ఒకే ట్రాక్టర్ నడవడం వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. మరో ట్రాక్టర్ కావాలని గత రెండు సంవత్సరాలుగా ప్రతిసారి సమావేశంలో కోరడమైనది కమిషనర్లు మాట ఇవ్వడం జరుగుతుంది. కానీ మరో ట్రాక్టర్ను పంపించడం లేదు. ఆగస్టులో ఈ ట్రాక్టర్ విషయమే నేను నిరసన కూడా చేపట్టడం జరిగింది. అప్పుడు మరో ట్రాక్టర్ ఇస్తామని చెప్పి ఆ ట్రాక్టర్ కేవలం రెండు నెలలకు మాత్రమే నడిపించి తొలగించడమైనది. ఇప్పుడు నడిచే ట్రాక్టర్ సరిగ్గా రావడం లేదు. పైగా మరో ట్రాక్టర్ నడిపించడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా శానిటేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై వెంటనే కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని సానిటేషన్ అధికారులపై చర్య తీసుకుంటూ ఒకటి రెండు రోజుల్లో వెంటనే లేబర్ లతో కూడుకొని ఉన్న మరో ట్రాక్టర్ను ఏర్పాటు చేయాలని కోరడమైనది లేని పక్షంలో తప్పని పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాము.
సంపూ నిర్మాణం జాప్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పై చర్య తీసుకోండి 20 డివిజన్లో ప్రజల అందరి కొరకు మంచినీటి సమస్య తీర్చాలని సంపూ నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ కాంట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణం ను జాప్యం చేస్తున్నాడు. వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని ఎన్నిసార్లు కోరిన కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆందోళన చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కావున కమిషనర్ ప్రత్యేక చొర తీసుకొని వెంటనే కాంట్రాక్టర్ పై చర్య తీసుకుంటూ సంపూ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేపించాలని కమిషనర్ ప్రత్యేకంగా కోరడం జరుగుతున్నది.
పై రెండు సమస్యలపై వెంటనే పరిష్కారం చూపలేక పోతే ప్రజల సౌకర్యం కోసం సంక్షేమం కోసం ప్రజాస్వామ్యయుతంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట నల్ల కండవలతో నిరసనలు చేస్తామని సవినయంగా తెలియజేస్తున్నాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App