
సంపద కేంద్రాలనుసందర్శించిన సుధాకర్ రావు
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు త్రినేత్రం న్యూస్. గ్రామాల్లో చెత్త సేకరించి వాటి ద్వారా సంపద సృష్టించాలని అందుకు ప్రతి పంచాయతీలో సంపద కేంద్రాలను వినియోగించు కోవాలని డిపిఓ సుధాకర్ రావు సూచించారు.
ఈరోజు పెనుమూరు మండలంలోని పలు పంచాయతీలోని సంపద కేంద్రాలను తనిఖీ చేశారు. సదరు మండలంలోని రామకృష్ణాపురం శాతంభాగం పంచాయతీ పరిధిలోని సంపద కేంద్రాలను తనిఖీ చేసి, తడి పొడి చెత్త సేకరణను పరిశీలించారు. గ్రీన్ అంబాసిడర్ లతో పనులు సక్రమంగా పని చేయించాలని, ప్రతి సంపద కేంద్రాన్ని నందనవనంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
