Successful with illegal arrests
తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, చలో రాజ్ భవన్ ధర్నా
అక్రమ అరెస్టులతో విజయవంతం
హైదరాబాద్ సింగరేణి భవన్ లో అధికారులకు వినతి పత్రం అందించిన సిఐటియు బృందం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు చలో హైదరాబాద్ రాజ్ భవన్ ధర్నాకు వెళుతున్న కార్మిక సంఘాల నాయకులను కార్మికులను పెద్ద ఎత్తున అరెస్టు చేయడం జరిగింది, అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావు తో పాటు, అర్జి1, బ్రాంచి అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఎస్కే గౌస్, ఏ శంకరన్న, వెంకటేశ్వర్లు, మరో 10 మందితో పాటు అర్జి2, బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు అర్జి3, శ్రీరాంపూర్ మందమరి కొత్తగూడెం బ్రాంచీల సిఐటియు బృందాలను, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, తదితర పోలీస్ స్టేషన్లో వందల మంది కార్యకర్తలు అరెస్టు చేయడం జరిగిందని ప్రజాస్వామ్యబద్ధంగా మా బొగ్గు బావులు మాకు కావాలని డిమాండ్ చేస్తే అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మా సింగరేణి బొగ్గు బావులు దక్కేంతవరకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతామని హెచ్చరించారు, పై అరెస్టులను గమనించిన సిఐటియు గోదావరిఖని శ్రీరాంపూర్ కొత్తగూడెం బృందం, సింగరేణి భవన్ కు వెళ్లి, సింగరేణి భవన్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ వినతి పత్రం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో, అర్జి1, బ్రాంచ్ కార్యదర్శి మెండె శ్రీనివాస్, కారం సత్తయ్య, దాసరి సురేష్, జంగాపల్లి మల్లేష్, ఇప్పలపల్లి సతీష్, పి సమ్మయ్య, మందమరి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకట స్వామి, కొత్తగూడెం బ్రాంచ్ అధ్యక్షులు జి రాజారావు, అర్జి3, బ్రాంచ్ నాయకులు ఈ కుమార్ వెంకటేశ్వర్లు, 50 మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App