
Trinethram News : కోనసీమ జిల్లా : ఉప్పలగుప్తం: పాఠశాలలో రాగి జావ తాగిన 14 మంది విద్యార్ధులకు అస్వస్థతకు గురయ్యారు.. వారిని హుటాహుటీన ఆసుప్రతికి తరలించి చికిత్స చేస్తున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం జగ్గరాజు పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 26 మంది విద్యార్థిని విద్యార్థులు రాగిజావ త్రాగి అస్వస్థతకు గురవడం స్థానికంగా కలకలం రేగింది. దీంతో విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.. అత్యవసర చికిత్స నిమిత్తం అమలాపురంలోని ఏరియా ఆసుప్రతికి తరలించి వైద్యసేవలందించారు.
స్కూల్ కుక్ కమ్ హెల్పర్ ఇంట్లో శుభకార్యం ఉండడం వల్ల మంగళవారం ఉదయమే రాగిజావను ఇంటి వద్ద తయారుచేసి పాఠశా లలకు తీసుకువచ్చిందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ రాగి జావను ఉదయం 10:30 సమయంలో విద్యార్థులకు పెట్టడం జరిగిందని, అయితే రాగిజావ తాగిన విద్యార్థులు కాసేపటికి వాంతులు చేసుకున్నట్లు చెప్పారు.
కడుపులో వికారంగా ఉందని అందరు విద్యార్థులు చెప్పడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే ఎన్.యానాం పీహెచ్‌సీకు సమాచారం అందించి హుటాహుటీన ఆసుప్రతికి తరలించారు. అప్పటికే రాగిజావ తాగిన 14 మంది అస్వస్థతకు గురికాగా వారికి అత్యవసర చికిత్స అందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
