యోగా పోటీల్లో సత్తాచాటిన శ్రీ చైతన్య విద్యార్థులు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
బెల్లంపల్లి పట్టణమునందు తేదీ 29-12-2024 ఆదివారము నాడు ఇండియన్ యోగ స్కూల్, జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ మంచిర్యాల వారు సంయుక్తంగా నిర్వహించిన పోటీలలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం నందుగల ఆర్.ఎఫ్.సి.యల్ టౌన్షిప్ లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు -అధిక సంఖ్యలో పోటీలో పాల్గొని మంజునాథ్, లోహిత్, కార్తికేయ బంగారు పతకాలు సాధించగా, యువన్, హిమజ మన్విత్ వెండి పతకాలు సాధించగా అలాగే శ్రీనిత్, మేఘాన్షా, సాత్విక్ రజత పతకాలు సాధించారు. విద్యార్థులు ఇంతటి విజయాన్ని సాధించినందుకు గాను పాఠశాల ప్రిన్సిపాల్ రవి గారు, క్యాంపస్ ఇంచార్జ్ నరేంద్ర కుమార్, డీన్ రమేష్, సౌజన్య శిక్షణను అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు సంపత్, స్వప్న, సందీప్ లకు అభినందనలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App