
సెయింట్ జూడ్స్ హై స్కూల్ పాఠశాలలో నిర్వహణ
పాల్గొన్న స్కూల్ విద్యార్థిని విద్యార్థులు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహిళా పోలీస్ స్టేషన్ సీఐ
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 1 నగర నిజం :2025-26 విద్యా సంవత్సరానికి ఇన్వెస్టిట్యూర్ సెరేమోనీ డే వేడుకను ఎంతో ఉత్సాహంగా ఘనంగా శనివారం నాడు సెయింట్ జూడ్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ పద్మ సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివచంద్ర పాల్గొన్నారు. అతిథులుగా ఫాదర్ డెన్నిస్ భాస్కర్, టీ.రాజారెడ్డి ఇన్యాసమ్మ రిటైర్డ్ టీచర్స్ సెయింట్ జూడ్స్ వికారాబాద్. స్పెషల్ గెస్ట్ లుగా ఉషారాణి సెయింట్ జూడ్స్ ప్రైమరీ పాఠశాల వికారాబాద్, జేస్య్ జోసెఫ్ ఇంచార్జ్ బీఈడీ బీఈడీ సెయింట్ జూడ్స్ పాఠశాల వికారాబాద్. బి అన్నమ్మ, కరస్పాండెంట్, పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ పద్మ ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు.
తర్వాత సాంప్రదాయపద్ధంగా దీప ప్రజ్వలనచేశారు. సెయింట్ జూడ్స్ పాఠశాలల్లో నియమితులైన ఇన్వెస్టిట్యూర్ సెరేమోనీ విద్యార్థి నాయక సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ గౌరవనీయమైన పాఠశాల విద్యార్థి నాయకులుగా ఇప్పుడు ఎదుర్కొంటున్న ముఖ్యమైన బాధ్యతలను ప్రిన్సిపల్ నొక్కి చెప్పారు. తర్వాత విద్యార్థులుగా గంభీరమైన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారికంగా ఆదర్శంగా నాయకత్వం వాయించడానికి తమను తాము కట్టుబడి ఉన్నామన్నారు. వారిపై ఉంచబడిన జవాబుదారితనం మరి ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తూ కొత్త పాత్రలు మరియు బాధ్యతలు వైపు కవాతు చేస్తున్నప్పుడు సాషేస్, బ్యాడ్జీలు మరియు సంబంధిత జెండాలను వారికి అందజేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ పరిచయ ప్రయాణంలో వారికి వారి తల్లిదండ్రుల మద్దతు మరియు మార్గదర్శకత్వం ఎల్లప్పుడు ఉంటుందని విద్యార్థులకు గుర్తు చేశారు. పాఠశాల గాయక బృందం వారి సవ్యమైన స్వరాలు మరియు బాధితులను గుర్తుచేస్తూ మరింత గంభీరంగా మారాలని హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పద్మ అన్నారు. ప్రేరణ అనే అంశంపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేయగా దేశాన్ని గౌరవించడం దాని గురించి ఉద్వేగ భరితంగా మాట్లాడి తోటి విద్యార్థుల విధులను గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ పీపుల్ లీడర్ గా అబ్దుల్ ఖాదర్, వైస్ స్కూల్ పీపుల్ లీడర్ గా ఎండి అర్మాన్, బాలికల స్పెషల్ లీడర్ బిఈ వాజస్ పిన్ గర్ల్స్ మహిళ వైస్ పీపుల్ లీడర్ గా ఏ. ప్రణవి బాయ్స్ గేమ్ కెప్టెన్ గా మహమ్మద్ జహంగీర్ బాయ్స్ గేమ్స్ వైస్ కెప్టెన్ గా ఏ. తేజస్,గర్ల్స్ గేమ్స్ కెప్టెన్ గా ఎం వైష్ణవి, వైస్ కెప్టెన్ గా పి.శ్రావణి,శామ్ రొక్ బాయ్స్ కెప్టెన్ గా కె.మనోజ్ గౌడ్ శ్యామ్ రొక్ గర్ల్స్ కెప్టెన్ గా బి. సాయి ప్రియ, డాపొడిల్ బాయ్స్ కెప్టెన్ గా కే.సాయి వర్ధన్, దాపొడిల్ గర్ల్స్ క్యాప్టెన్ గా మైరా ఫాతిమా, లోటస్ బాయ్ కెప్టెన్ గా పి సాయి చరణ్, లోటస్ గర్ల్స్ కెప్టెన్ గా ఎం ఎస్తేరు రాణి, రోజ్ బాయ్స్ కెప్టెన్ గా జి.తేజోనిది , రోజ్ గర్ల్స్ కెప్టెన్ గా పి అక్షిత ముఖ్యఅతిథిగా పాల్గొన్న వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివచంద్ర మాట్లాడుతూ కొత్తగా నియమితులైన నాయకులకు ప్రోత్సాకరమైన మాటలు చెప్పారు.
విద్యార్థి లక్ష్యాలను సాధించే జీవితాలను గడపాలని మరియు మీ ఆశయాలను సాధించే దిశగా కృషి చేయాలని కోరారు. విద్యార్థి లక్ష్యసాధనతో ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులలో ఆశాభావాలని నింపారు. విద్యార్థిగా ఉన్నప్పుడే కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చదివితే మీ లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. విద్యార్థులుగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మంచి పాఠశాలను మంచి ఉపాధ్యాయులను ఎన్నుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు అని శివచంద్ర అన్నారు.
రాబోయే పరీక్షల్లో మంచి లక్ష్యసాధన తో సాధన చేసి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆయన విద్యార్థులను కోరారు. మీ జీవితాలు మీ చేతులే ఉన్నాయి బాగుపడాలన్నా మీరే పక్కదారి పట్టాలన్న మీరే కాబట్టి మంచి ఆలోచనతో మీరు జీవితాలను కొనసాగిస్తే మీ జీవితాలు ఇంకొకరికి ఆదర్శంగా ఉంటాయని ఆయన విద్యార్థులకు తెలిపారు. శ్రమ మీ సంకల్పం అయితే విజయం మీకు బానిసవుతుందని అన్నారు. కాబట్టి ఏదైనా సంకల్పంతో సాధించాలని పట్టుదల మీలో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
