Strong measures to provide essential nutrients to all children
ప్రతి బుధవారం అంగన్వాడి కేంద్రాల్లో పోషక లోప పిల్లల తల్లి తండ్రులతో సమావేశం..
పోషక లోపం పిల్లల బాలామృతం ప్లస్ తప్పనిసరిగా అందించాలి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖనిలో రాక్ గార్డెన్స్ లో నిర్వహించిన పోషణ్ మహా 2024 సమావేశంలో పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ పాల్గొన్నడం జరిగింది…
పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా రాక్ గార్డెన్స్ లో నిర్వహించిన గర్భిణులకు శ్రీమంతం, పసిపిల్లలకు అక్షరాభాస్యం కార్యక్రమాల్లో పాల్గొని ఆశీర్వదించడం జరిగింది
ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ..
అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, ప్రతి పిల్లవాడి ఎత్తు, బరువు పరిశీలించి సరైన వివరాలు నమోదు చేయాలని, పోషక లోపాలు ఉన్న పిల్లలకు బాలామృతం తప్పనిసరిగా అందజేయాలని రామగుండం ఎమ్మెల్యే అంగన్ వాడి టీచర్లకు సూచించారు.
ప్రతి బుధవారం పోషక లోపం ఉన్న పిల్లల తల్లి తండ్రులతో పిల్లల అందించాల్సిన పోషకాహారం, పాటించాల్సిన శుభ్రత పై అవగాహన కల్పించాలని. గ్రామాలలో అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లల జాబితా ఉంటే సేకరించి సమర్పించాలని అన్నారు. అంగన్ వాడి టీచర్లు చేసే కృషి ప్రతి ఒక్కటి గమనిస్తున్నామని , బాగా పని చేసే వారికీ తప్పనిసరిగా మంచి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గుడ్ల నాణ్యతను పరిశీలించాలని, నాణ్యత లేని, సైజ్ తక్కువ ఉన్న గుడ్లను తిరస్కరించాలని తెలిపారు. పాలు, పప్పు సరఫరా మొదలగు అంశాలలో ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే మా దృష్టికి అలాగే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు అనేమియా ఉంటే అవసరమైన పోషకాహారం, మందులు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
అంగన్ వాడి కేంద్రాలను పూర్వ విద్యా కేంద్రాలుగా మారుతున్నాయని,కర దీపిక, ప్రియదర్శిని ప్రకారం పిల్లలకు ఆట పాటలతో బోధన అందించాలని అన్నారు.
ప్రతి రోజు అంగన్ వాడి కేంద్రాలలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బోధన జరగాలని అన్నారు. రామగుండం నియోజకవర్గ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం నిర్మించేలా అనువైన స్థలం గుర్తించి కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు పౌష్టికాహారం సజావుగా అందజేయాలని అన్నారు. సమాజంలో తల్లిదండ్రులు, గురువులకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, పసి పిల్లలకు అంగన్వాడీ టీచర్లకు తొలి గురువులు అవుతారని, ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించాలని అన్నారు…
ఈ కార్యక్రమంలో దవు రౌఫ్ ఖాన్,సీడీపీఓ అలేఖ్య పటేల్, అంగన్వాడి టీచర్లు , సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు , మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ , తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App