
Trinethram News : ఆదివాసి ప్రజలపై మరణకాండ ఆపాలి, ఆపరేషన్ కగార్ ని బెషారు ఎత్తుగా నిలిపి వేయాలి, బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించాలి.– వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు,
దేశంలోని అడివి ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనుల అడవి నుంచి ఎల్లా కొట్టడానికి దేశ పౌరులు అయినా గిరిజనులు చంపడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా రాజమహేంద్రవరం గొకవరం బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ సెంటర్లో వివిధ వామపక్ష పార్టీల ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జే సత్తిబాబు పీ కే ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె మస్తాన్ పి ఓ డబ్ల్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లిక, కేవిపిఎస్ నాయకులు కోనాల లాజర్,న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి కే జోజి తదితరులు మాట్లాడుతూ దేశ సంపదను సామ్రాజ్యవాదులకు కట్టు పెట్టేందుకు దేశ ప్రజలను ఆపరేషన్ కగార్ పేరుతో వేల మందిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు మోడీ పాలన ప్రజల కోసమా కార్పొరేట్ల కోసమా అని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించారు,
ప్రస్తుతం బీజాపూర్ లో కొనసాగుతున్న మానవహోమాన్ని ఆపివేయాలి చతిస్గడ్ రాష్ట్రంలో బిజెపి నేతంలో ప్రభుత్వం ఏర్పడి నుండి ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలపై, మావోయిస్టులపై భారీ ఎత్తున అత్యాకాండ ఎడతెరిపి లేకుండా కొనసాగుతోంది ఈ హత్యాకాండ స్వయంగా కేంద్ర హోంమంత్రి ప్రోత్సాహంతో దేశ రాజ్యాంగాన్ని, చట్టాలకు వ్యతిరేకంగా సాగుతుంది దేశ పౌరులపై వేలాది మంది పోలీసు బలగాలు తో డ్రోన్లు, వైమానిక దళాలతో సాగుతున్న కగార్ ఆపరేషన్ పేరిట వందలాది అమాయక ఆదివాసీలను కిరాతకముగా పొట్టన పెట్టుకుంటు కోవడాన్ని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలుగా , తీవ్రంగా ఖండిస్తున్నాం, ఈ అమానుష కిరాచక అత్యాకాండను భారత రాష్ట్రపతి అడ్డుకోవాలని, బూటక ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించాలని కోరారు.
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు ఈ హత్య కాండను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు టీ నాగేశ్వరరావు,మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పి లావణ్య ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు పి నాగేశ్వరరావు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కే అప్పారావు పికే ఎస్ జిల్లా నాయకులు పి సుబ్బారావు తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు
కోరడ అప్పారావు
సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
