![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-19.34.11.jpeg)
మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా..సబీహా గౌసుద్దీన్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 5: కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అన్నారు. స్థానికుల ఫిర్యాదుతో కార్పొరేటర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు కార్పొరేటర్ దృష్టికి మంచినీటి సప్లై కొరత ఉందని, మంచినీరు కలుషితమవుతుందని, సీసీ రోడ్డు, విద్యుత్ దీపాల సమస్యలు స్థానికులు తెలియపరిచారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి మంచినీటి కలుషితం, మరియు నీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్పొరేటర్ జలమండలి మేనేజర్ అన్వేత్ కి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జహీద్ షరీఫ్ బాబా, టిఆర్ఎస్ రాజు, బద్రి నాయక్, బ్రహ్మ, కళ్యాణ్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, అప్పన్న, శంకర్, కొండయ్య, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Sabiha Gausu](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-19.34.11-1024x576.jpeg)