నిరంతర తనిఖీలు జీసీసీ అధికారుల గుబులు ముంచంగిపుట్టు మండలంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్.
అల్లూరి సీతారామరాజు జిల్లా,త్రినేత్రం న్యూస్, జనవరి 25.
శ్రావణ్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా ముంచింగిపుట్టు జీసీసీ గ్యాస్ గోడౌన్ ను తనిఖీ శ్చేసారు.సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉండగా గ్యాస్ ఇంచార్జి ఎవరు అని అడగ్గా గ్యాస్ ఇంచార్జి సారె కొండబాబు గత రెండు సంవత్సరాల నుండి విధులకు రావటం లేదని అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూన్నారని జీసీసీ సిబ్బంది సమాధానం చెప్పగా,అధికారులపై ఏమిటి ఇది అని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్,ఆగ్రహం వ్యక్తం చేసారు.అనంతరం జీసీసీ గోడౌన్ లను తనిఖీ చేసి రికార్డులను తనిఖీ చేయగా ఎంసీ బాల్యూ గ్యాస్ ఇంచార్జి కొండబాబు హాజరు పట్టిక చూసి సంతకాలు లేకపోవటంతో సిబ్బందిపై జీసీసీ చైర్మన్ అసహన వ్యక్తం చేసారు.అనంతరం విలేకరులతో రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధులు సక్రమంగా నిర్వహించాలని లేకపోతే సాహించేది లేదని, కాఫీ కొనుగోలుపై ప్రతి ఒక్కరు ద్రుష్టి సారించాలని 15వందల నుండి 2000 వేలు మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పని చేస్తున్నామని పార్చిమెంట్ 350 రూపాయలు, చెర్రీ 200రూపాయలు, రోబాష్ట చెర్రీ కాఫీ 130 రూపాయలని జీసీసీ సిబ్బందికి ఇచ్చిన టార్గెను పూర్తి చేయాలనీ గత నెల పరచిమెంట్ 320 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఉన్నారని అటువంటి కాఫి రైతులకు బోనస్ రూపంలో 30రూపాయలు చెల్లిష్టమన్నారు.
అలాగే జీసీసీ లో పని చేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి ఆదాహక్ పద్దతిలో ప్రమోషన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్,అన్నారు. జీసీసీ చైర్మన్ వెంట మండల అధ్యక్షులు కిల్లో బాలరాం, ప్రధాన కార్యదర్శి కొంతేరి జగత్ రాయ్,రాష్ట్ర ఎస్టీ సెల్ ఆర్గనైజషన్ సెక్రటరీ సాగర సుబ్బారావు,అడికతీయ తిరుపతి రావు,దారెలా సర్పంచ్ పాండురంగ స్వామి,వంభాసింగి సర్పంచ్ లక్ష్మణ్, కిలాగడ సర్పంచ్ శివ శంకర్, రంగభయాల సర్పంచ్ ధన్య, జోలాపుట్ మాజీ సర్పంచ్ రామస్వామి,టీడీపీ సీనియర్ నాయకులు కిరసాని లైకోన్ మాజీ సర్పంచ్ ,త్రినాద్,మండల ఉపాధ్యక్షులు సామాల బాబూజీ,యూనిట్ ఇంచార్జి మజ్జి చిన్నిబాబు, బాలన్న,టీడీపీ నాయకులు మాణిక్యం, ప్రభాకర్, గోపాలం,మండి కిషోర్,కిల్లో లైకోన్,రామారావు,యూనిట్ ఇంచార్జి భీమన్న,బూత్ ఇంచార్జి సూర్య, ఆనంద్,త్రినాద్, మురళి, బుక్క జగదీష్, తిరుపతి తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App