
Trinethram News : బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు, ఆదరణ పధకాల పునరుద్దరణపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసే లాగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడుతూ… ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ లో సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమ ప్రాధాన్యత ఇచ్చినదని, గడిచిన 5 ఏళ్ళ కాలంలో వైసీపీ చేసిన విధ్వంసాల నుంచి వికాసం వైపు నడిపించే నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయన విజన్ ను ప్రతిబింబించేలా రాష్ట్ర బడ్జెట్ రూపొందించారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు.
పేద, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉన్నదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతులు, మహిళలను ఆర్ధికంగా పైకి తీసుకొని వచ్చేలా బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 73 పథకాలను కూటమి ప్రభుత్వం పున:ప్రారంభించిందని, సూపర్ సిక్స్ పధకాల అమలులో భాగంగా ఎన్టీఆర్ భరోసా, దీపం – 2.0 పథకాలకు రూ.31,613 కోట్లు విడుదల చేసి ప్రజలకు అండగా నిలబడిందని, రైతులకు పెట్టుబడి సాయానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్ లో రూ.6,300 కోట్లు కేటాయించినదని, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ లో రికార్డు స్థాయిలో రూ.4,332 కోట్లు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.
2025 – 26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ‘తల్లికి వందనం’ కింద రూ.15 వేలు ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయించారని, చేనేత, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు కేటాయించారని, ఆదరణ పథకం ఎన్డీయే కూటమి ప్రభుత్వం పునరుద్ధరించటం బిసిలకు ఆపన్న హస్తం అందించటమేనని, దీనికి బీసిల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
