
తేదీ : 02/04/2025. కృష్ణ జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మచిలీపట్నం నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి శ్రీ విక్టోరియా మెమోరియల్ బిల్డింగు మరియు పబ్లిక్ లైబ్రరీ ఎంతో చరిత్ర కలిగి ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా మూసి వేయడం అత్యంత బాధాకరమని మచిలీపట్నం సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షులు , న్యాయవాది లంకి శెట్టి. బాలాజీ ఉన్నారు. అయినా పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ దశాబ్దాలుగా కొన్ని వేల మీటింగులు నిర్వహించిన టౌన్ హాలు దేవాలయ ,ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఉండి మూత బడిపోవడం అత్యంత అవమానకరమని చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ బాలాజీ దీనిపై దృష్టి పెట్టాలని, కోరారు.
ఆంధ్ర సరస్వతి సమితి, సాహితీ మిత్రులు కళాశాల సమితి, రంగస్థలం కళాకారులు వంటి లయన్స్ క్లబ్ ,రోటరీ క్లబ్ వంటి సంస్థల ద్వారా ఎందరో సినీ తారలు టీవీ నటీ ,నటీమణులు నటించిన వేదిక అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఉగాదికి ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నికలు, లైబ్రరీ నిర్వహణలో టౌన్ హాలు కి పెట్టింది పేరని బాలాజీ తెలియజేశారు. విశాలమైన ప్రాంగణంలో పార్కింగ్ సదుపాయం, కలిగి ఓపెన్ ఆడిటోరియం ఉన్న టౌన్ హాలును తక్షణమే రిపేర్లు చేయించి స్వచ్ఛంద సంస్థలు, సాహిత్య సంస్థలు కళాకారులకు, ప్రభుత్వ కార్యక్రమాలకు అనుగుణంగా ఉండే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
టౌన్ హాలుకు అనుబంధంగా ఉన్న బిల్డింగు ను రాజకీయాలతో ముడిపడి సచివాలయం కు కేటాయించడం సరైన నిర్ణయం కాదని బాలాజీ అన్నారు. సుందరమైన మొక్కలు, చిన్నపిల్లలకు ఆట వస్తువులతో కూడిన పార్కును కూడా అందుబాటులోకి తీసుకురావాలని, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి , రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో మాట్లాడి మచిలీపట్నం నగర ప్రజలకు టౌన్ హాలును మంచి అందుబాటులోకి తీసుకురావాలని బాలాజీ విజ్ఞప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
