
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన అధ్యక్షులు రామావత్ రవీంద్ర
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. మార్చి 2 నుంచి దాసరినెమిలిపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
-శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 38వ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
మార్చి 2 నుంచి 6 వరకు దాసరినెమిలిపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.బుధవారం డిండి మండలం దాసరినెమిలిపూర్ గ్రామంలో నిర్వహించే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 38వ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ….. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామచంద్రం, గంగిడి నరేందర్ రెడ్డి, గంగిడి కొండల్ రెడ్డి, పసునూరి వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
