TRINETHRAM NEWS

KAT ఒలంపియాడ్ లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు కట్ ఒలంపియాడ్ జాతీయస్థాయి పరీక్షలో ఘన విజయం సాధించారు. దీనిలో భాగంగా నలుగురు విద్యార్థులు నగదు బహుమతిని గెలుచుకున్నారు. గ్రీష్మిత 9వ తరగతి, అభిజ్ఞాన్ 8వ తరగతి, ఆర్యన్, అఖిలేష్ లు 7వ తరగతి వీరు 1000 రూపాయల నగదు బహుమతులు సాధించారు. వీరితో పాటు దాదాపు 30 మంది విద్యార్థులు గోల్డ్, సిల్వర్ మెడల్స్ మరియు ప్రశంస పత్రాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విద్యార్థులను మెడల్స్ మరియు ప్రశంస పత్రాలతో, బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవిందరెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు పాఠశాల డీన్ శ్యాంసుందర్, సి బ్యాచ్ ఇంచార్జ్ కిరణ్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App