Special plan for urban development of Sultanabad
సుల్తానాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి సుమారు 11 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేయబోతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.
బుధవారం రోజున సుల్తానాబాద్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో (DDUPSP ) ₹25 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ఏడు షాపింగ్ సెట్టర్స్ కాంప్లెక్స్ ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పలువురు ఘనంగా సన్మానించారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు.
సుల్తానాబాద్ పట్టణంలో మండల ప్రజా పరిషత్ వారు దుకాణ సముదాయాలు నిర్మించడం ద్వారా పట్టణంలో వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రణాళికకు పాటుపడుతున్నామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దుకాణ సముదాయంలోని గదులను ఓపెన్ టెండర్ ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
(అనంతరం)
సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, గ్రామానికి చెందిన NRI శ్రీ ముద్దసాని సుధీర్ రెడ్డి సమకూర్చిన స్కూల్ బ్యాగులను, నోట్ బుక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు
రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగం అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నెలకొల్పడం జరుగుతోందని, పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాలలో నెలకొల్పడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఇందుకోసం 10వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పాఠశాల లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాకుండా, భవనాల రిపేర్లను కూడా చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మినుపాల స్వరూప రాణి ప్రకాష్ రావు, స్ధానిక ఎంపీపీ, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమతా కృష్ణ, ఎంపీడీవో దివ్యదర్శన రావు, తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, స్థానిక ఎంపిటిసిలు, కాంగ్రెస్ పార్టీ పట్టణ & మండల అధ్యక్షులు, వెగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, దాన్నాయక్ దామోదర్ రావు, శ్రీగిరి శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App