
మహాశివరాత్రి సందర్భంగా 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం
శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 ప్రత్యేక బస్సులు
ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను సవరించిన ప్రభుత్వం
Trinethram News : తెలంగాణ : ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 24 నుండి నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు మూడు వేల ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, వేములవాడకు 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, కుర్చీలు, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం శివరాత్రికి నడిచే ప్రత్యేక బస్సుల్లో ధరలను 50 శాతం మేర సవరించింది. రెగ్యులర్ సర్వీసుల టిక్కెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. 24 నుండి 28వ తేదీ వరకు నడిచే ప్రత్యేక బస్సుల్లో సవరించిన ఛార్జీలు అమలవుతాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
