TRINETHRAM NEWS

మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వ భూమిని పట్టించుకోండంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ సభవత్ మోతిలాల్ నాయక్ కు వినతి పత్రం ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ .. అనంతరం ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ* మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో గల భూమి సర్వే నంబర్ 364 విస్తీర్ణం ఎకరం 30 గుంటలు రికార్డులలో
ప్రభుత్వ భూమిగా ఉంది అట్టి ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ వేసి ప్లాట్లుగా చేసి
అదే వెంచర్లో కొన్ని సంవత్సరాల క్రితం ఫామ్ హౌస్ నిర్మించినట్టు సమాచారం అన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
విచారణ జరిపి అట్టి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని వాటిలోని నిర్మాణాలను తొలగించాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరిందన్నారు బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు వేముల వీరేందర్, దాగామ శ్రీనివాస్, కుమ్మరి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

President Mulkalla Rajendra Prasad