హైదరాబాద్: చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సనత్‌నగర్ – మౌలాలి మధ్య 21 కిలోమీటర్ల మేర రెండో లైను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, సికింద్రాబాద్ స్టేషన్‌ను బైపాస్ చేస్తూ ఈ మార్గంలో కొన్ని రైళ్లు నడపడానికి వీలు కలుగుతుందని తెలిపారు. రైల్వే బడ్జెట్ కేటాయింపులపై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చర్లపల్లి స్టేషన్ నుంచే కొన్ని రైళ్లు నడుపుతామని.. లింగంపల్లి – సనత్‌నగర్ – మౌలాలి – చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లకుండా కొన్నిటిని నడపడం ద్వారా రైళ్ల ఆలస్యానికి చెక్ పెడతామన్నారు. చర్లపల్లి స్టేషన్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఈ బడ్జెట్లో రూ. 46 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. రూ. 817 కోట్ల అంచనాలతో 2012 -13లో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండోదశకు రూ. 50 కోటు, ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు కొనసాగించడానికి మరో రూ.10 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.381 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. సఫిల్‌గూడ ఆర్‌యూబీకి రూ.2 కోట్లు, ఫలక్‌నుమా – బుద్వేల్ మధ్య నాలుగో లైనుకు రూ.5 కోట్లు కేటాయించారు.మౌలాలి-సనత్‌నగర్ మధ్య 21 కి.మీ.ల మేర రెండో లైను, విద్యుదీకరణ దాదాపుగా పూర్తి కావచ్చిందన్నారు. సీతాఫల్మండి- మౌలాలి-మల్కాజిగిరి మధ్య 10 కి.మీ.ల మేర నాలుగో లైను నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. మౌలాలి – సనత్‌నగర్ మధ్య రెండో లైను సిద్ధమవ్వడంతో లింగంపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో కొన్నిటిని సనత్‌నగర్ – మౌలాలి మీదుగా నడుపుతామని.. ఎంఎంటీఎస్‌లు కూడా కొంత మేర అందుబాటులోకి తెస్తామని జీఎం చెప్పారు.
చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అన్నారు
Related Posts
25న బీసీల సమరభేరి
TRINETHRAM NEWS 25న బీసీల సమరభేరి..!! జనగణనలో కులగణన చేపట్టాలిబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యTrinethram News : హైదరాబాద్, నవంబర్ 23 : జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు…
శ్రీ చైతన్య కాలేజీలో ఆగని ఆత్మహత్యలు
TRINETHRAM NEWS శ్రీ చైతన్య కాలేజీలో ఆగని ఆత్మహత్యలు హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం అంటూ, వారి పిల్లలకు ఇష్టం లేకున్నా కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేసి లక్షల్లో ఫీజులు కట్టి వారి పిల్లలను…