సోషల్ ఆడిట్ పారదర్శకంగా జరగటం లేదు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్ : సోషల్ ఆడిట్ పారదర్శకంగా జరగటం లేదు : బీజేపి మండల పార్టీ అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు. అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:
ఈనెల 16వ తేదీ నుండి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి, మండలంలో సోషల్ ఆడిట్ జరుగుతుంది. ఈ సోషల్ ఆడిట్ కి సంబంధించి బిజెపి కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు స్పందించారు. ఆడిట్ అనేది గ్రామాల్లో ప్రజల వద్దకు డిఆర్పి వెళ్లి పనులకు సంబంధించిన, అంశాలు గురించి పనికి వేతనాలు సకాలంలో అందుతున్నాయా? లేదా? ఇలా పలు విషయాలు గురించి మాట్లాడి అడిగి తెలుసుకోవాల్సింది పోయి, ప్రజల దగ్గరకు వెళ్ళేటప్పుడు డిఆర్పి తో పాటు విఆర్పి కూడా ఉంటున్నారని, అలాంటప్పుడు వాస్తవ విషయాలు బయటకు ఎలా వస్తాయని బీజేపి మండల పార్టీ అధ్యక్షుడు అప్పలరాజు ప్రశ్నించారు. సోషల్ ఆడిట్ పారదర్శకంగా జరగటం లేదని అన్నారు. వీఆర్పీలను పక్కనే పెట్టుకొని ఆడిట్ చేయడం కాదని, డిఆర్పీలు స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి సోషల్ ఆడిట్ సక్రమంగా పారదర్శకంగా జరిగేలా చూడాలని , బిజెపి కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App