
ఎస్ ఎల్ బీసీ కార్మికులకు వైద్యం అందిస్తున్న డిండి (గుండ్లపల్లి) వైద్య సిబ్బంది.
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట సమీపంలో ఎస్ ఎల్ ఎల్ బి సి టన్నెల్ వద్ద ప్రమాదం జరిగిన సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్, డి ఎం హెచ్ ఓ ఆదేశాల మేరకు దోమల పెంటకు చేరుకొని సురక్షితంగా బయటపడిన వారికి వైద్య పరీక్షలు అందించినట్లు వైద్యాధికారి డాక్టర్ శైలి, ఒక ప్రకటనలో తెలిపారు.
శనివారం నుండి మంగళవారం వరకు సిబ్బంది అక్కడే ఉండి కార్మికులకు వైద్య పరీక్షలు అందిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తనతో పాటు వైద్య పరీక్షలు అందించిన వారిలో సిహెచ్ఓ శ్రీనివాస చారి, ఎం ఎల్ హెచ్ పి లు మమత, సోనియా, స్నేహ, చంద్రకళ, నికత్ తో పాటు 108 ఇబ్బంది రవి మధు అనిల్ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
