TRINETHRAM NEWS

Singareni should be removed from the auction of central coal blocks

రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

నేడు కేంద్రంలో కొనసాగుతున్న బిజెపి సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు.
ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విప్లవ కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కార్మిక వర్గం ఎంతో గొప్ప విరోచితమైన పాత్రను నిర్వహించారన్నారు. సింగరేణి ప్రైవేటీకరణన ఒక సింగరేణి కార్మికులకే పరిమితమైనది కాదు,,
ఇది తెలంగాణ సమాజానికి నష్ట ధాయకమని గుర్తించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సైతం సింగరేణి పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు తప్ప, అధికారంలోకి రాగానే ప్రవేటీకరణకు ఆద్యం పోస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతకుముందు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి HMS రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాస్,AIFTU నుండి విమలక్క,IFTU రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధ
ప్రధాన వక్తలుగా మాట్లాడారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు ఐ కృష్ణ, జక్కుల నారాయణ, జె సీతారామయ్య, కామెర గట్టయ్య, పెద్దపల్లి సత్యనారాయణ,పోచమాల్లు, చాంద్ పాషా,యం రాయమల్లు,ఈ నరేష్, శ్రీనివాస్, కుమారస్వామి,ఎస్ మల్లేష్, సారయ్య,ఏడుకొండలు,నీరటి రాజన్న,దావు రమేష్ ,ఎం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Singareni should be removed from the auction of central coal blocks