
పాపం పోలీస్ పేరుతో అడ్డగోలుగా దోచుకోవడం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాపం. అడ్డగోలుగా దోచుకోవడం పైనే దృష్టిపెట్టిన కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులు, పోలీసుల పోస్టింగ్ లకి డిమాండ్ ను బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు.
పోలీసు శాఖలో జోరుగా పైరవీలు నడుస్తున్నాయి*
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పోస్టింగులు నడుస్తున్నాయి. బదిలీలను సైతం తమ వ్యక్తగత అవసరాలకు అనుకూలంగా మార్చుకుని వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో ఒక్క పోలీస్ అధికారి దగ్గర కూడా పోస్టింగ్ ల కోసం డబ్బులు తీసుకోలేదు కాబట్టి వారి వృత్తి వారు సజావుగా చేసుకుని, లా ఆర్డర్ ని కాపాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీరు మారింది, పోస్టింగ్ రావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఆ భారాన్ని, వాళ్లు వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కి వస్తున్న ప్రజల పైన చూపిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
